Online News Media, Including Social Sites, Now Under Government Control
11 Nov

Amazon Prime, Netflix మరియు Hotstarలను Information and Broadcasting Ministry పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ నోటిఫికేషన్ ను రాష్ట్రపతి గౌ: రాంనాథ్ కోవింద్ గారు సోమవారం రిలీజ్ చేశారు. ఈ నిబంధన సోషల్ మీడియా మాధ్యమాలైన ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్ మరియు ట్విట్టర్ లకి కూడా వర్తిస్తాయి.

సినిమాలు, AV , వార్తలు, కరెంటు అఫైర్స్ మరియు ఆన్లైన్ కంటెంట్ మొత్తం ప్రభుత్వ నియంత్రణ కిందకి వస్తాయి. ఇప్పటివరకు వీటికి ఎటువంటి చట్టం కానీ నియంత్రణ సంస్థ కానీ లేవు. కానీ ప్రింట్ మీడియా అయినా పత్రికల్ని నియంత్రించడానికి ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా (పీసీ) ఉంది. వార్త చానెళ్లను నియంత్రించడానికి NBA అంటే న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ అనే సంస్థ ఉంది. సినిమాలను నియంత్రించడానికి CBFC ఉంది. ప్రకటనలను నియంత్రించడానికి అడ్వేర్టీసింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ అఫ్ ఇండియా ఉంది. కానీ ఆన్లైన్ చానెళ్లను నియంత్రించడానికి ఎటువంటి సంస్థ లేదు.

గత నెల ఉన్నత న్యాయస్థానం లో పిటిషన్ పై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటో తెలియజేయాలని సుప్రీమ్ కోర్ట్ ఆదేశించింది. దానికి కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ, OTT లను నియంత్రించడానికి ఒక ప్రత్యేక సంస్థ ఉండడం చాలా మంచిది అని తన నిర్ణయాన్ని తెలిపింది. అది భావ ప్రకటన స్వేచ్చకు ఆటంకం కలగకుండా అలాగే ఎటువంటి ద్వేషపూరిత ప్రసంగాలను అనుమతించకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది.

ఇప్పటివరకు OTT లలో ప్రసారం చేసిన సినిమాలు షార్ట్ ఫిలిమ్స్ కి ఎటువంటి సర్టిఫికెట్ అవసరం లేదు. ఇకముందు చూడాలి కొత్త చట్టాలు ఏమైనా నిబంధనలు తీసుకువస్తాయి ఏమో. ఏది జరిగిన ప్రజల మంచికొరకే.

Leave A Comment